ఎఫైర్: ప్రియురాలి ఇంట్లో అత్తరు వ్యాపారి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యాపారస్తుడు మృతి చెందిన ఘటన నగరంలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహానుమాకు చెందిన అత్తరు వ్యాపారి షేక్ అబ్దుల్ ముజఫర్(28)కు ముస్తాఫానగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు.
శనివారం రాత్రి ముజఫర్ ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. కాగా, రాత్రి సదరు మహిళ కుమారుడు ఇంటికి వచ్చి చూసే సరికి ముజఫర్ మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలో ఉంది.
ఇద్దరు చెల్లెళ్లు వాంతులు చేసుకుంటుండటంతో స్థానికులు వారిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కూల్‌డ్రింక్‌లో ఏమైనా కలుపుకుని తాగడంతోనే ముజఫర్ మృతి చెంది ఉంటాడని, ఇతరులు అస్వస్థతకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముజఫర్ కుటుంబసభ్యులు సైతం ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలోని కుల్‌డ్రింక్ సీసాను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు ఫలక్‌నుమా అదనపు ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ముజఫర్ మృతి ఘటనపై అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముజఫర్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ(50) భర్త 8ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె ముజఫర్‌తో సంబంధం ఏర్పరచుకుంది. కాగా, ఆమెకు ఐదుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.












Click it and Unblock the Notifications