చిరు వ్యాపారిపై ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్.. స్పందించిన కేటీఆర్
ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరు వ్యాపారిపై వారు దాడి చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్: ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరు వ్యాపారిపై వారు దాడి చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ.. 'ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడుంది?' అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు.

సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications