విధి వైపరీత్యం: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఘటనాస్థలికి వెళుతూ భార్య కూడా ప్రమాదంతోనే..

ఊహించని ఘటనతో రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, ఆ విషయం తెలిసి తీవ్ర దుఃఖంతో సంఘటన స్థలానికి వెళుతూ భార్య అనంతలోకాలకు చేరిన షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరుగా, తోడు, నీడగా ఉండాలి. కష్టాలైనా, కన్నీళ్ళైనా కలిసే పంచుకోవాలి అంటారు. కానీ ఈ భార్యాభర్తలు చావులోనూ నిన్ను వీడను అని తేల్చి చెప్పారు. విధి వైపరీత్యం అని ఈ ఘటనలు తెలిసిన వారు చెప్పుకుంటున్నారు.

ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ఆ భార్యాభర్తలు ఇద్దరూ చేసుకున్న వాగ్దానానికి, జరిగిన సంఘటన అద్దం పడుతుంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతం పల్లిలో ఒకే రోజు జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలలో మొదట భర్త, ఆ తరువాత ఘటనాస్థలానికి వెళుతూ భార్య మృతి చెందడం విషాదాన్ని నింపింది. అంతంపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొని 50 సంవత్సరాల భర్త సిద్దయ్య మృతి చెందాడు. ఇక భర్త మరణవార్త తెలుసుకుని బోరున రోదిస్తూ సంఘటనా స్థలానికి వెళ్తున్న భార్య కూడా రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకుంది.

Tragedy in kamareddy: Husband died in road accident,Wife also died while going to the accident place

భర్త మరణవార్త తెలిసి మరిదితో కలిసి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ నడుపుతున్న మరిది టెన్షన్ తో బైక్ పై నుండి కింద పడ్డారు సిద్ధవ్వ, ఆమె మరిది. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేశారు. అయితే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలభై నాలుగేళ్ల సిద్ధవ్వ మరణించారు.

రోడ్డు ప్రమాదంలో, రోడ్డుపైనే విగతజీవిగా మారిన భర్త, భర్తను చూడడానికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్య.. వెరసి ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులను మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తంఆస్పత్రికి తరలించి రోడ్డు ప్రమాద ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోనూ జరగదేమో అంటూ ఈ ఘటనలు తెలిసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+