స్కూల్ బస్సు ఘోరం.. ఒక్క క్షణంలో..!
ఆ స్కూల్ బస్సుకు ఒక్క క్షణంలో పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో వస్తున్న ఆ స్కూల్ బస్సుకు దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో బస్సులోని పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అదే బస్సు ఢీ కొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియోను తెలంగాణ పోలీస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. పిల్లలను స్కూల్ బస్సులో పంపే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరించింది.
స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నిష్ఠాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వ్యక్తి మృతికి కారణమైన ఈ సంఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది.#SchoolBusAccident #Miyapur pic.twitter.com/KPuVZNbdZh
— Telangana Police (@TelanganaCOPs) August 1, 2025
స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నిష్ణాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వ్యక్తి మృతికి కారణమైన ఈ సంఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది. అని తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

ఈ వీడియోలో ఓ బైకర్ ఓ వీధి గుండా స్పీడ్ గా వస్తున్నాడు. అదే స్పీడ్ లో ఓ స్కూల్ బస్సు వస్తోంది. టర్నింగ్ వద్ద స్కూల్ బస్సు స్పీడ్ ను గమనించని బైకర్ స్ట్రయిట్ గా వెళ్లేందుకు యత్నించగా ఒక్కసారిగా ఆ బస్సు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది.












Click it and Unblock the Notifications