Breaking: ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు; తగలబడుతున్న బోగీలు!!

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయి పల్లి మధ్య ఫలక్ నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు రెండు బోగీలు మంటల్లో దగ్ధం అవుతున్నాయి. ఫలక్ నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైలును ఆపివేసిన అధికారులు ప్రయాణికులను బోగీల నుంచి దింపేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధం అయినట్లుగా తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు. ఒక్కసారిగా ఊహించని సంఘటనతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

trainfireaccident

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయి పల్లి మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులో మూడు బోగీలు మంటల్లో దగ్ధం అవుతున్నాయి. ఫలక్ నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదాన్ని గుర్తించి రైలును ఆపివేశారు.

దీంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బోగీల నుండి దిగి పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక మంటలు చెలరేగడంతో మొత్తం మూడు బోగీలు దగ్ధం అయినట్లుగా తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో గుర్తించి వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు.

అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ రైలు మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం ఫైరింజన్లు మంటలను ఆర్పి వేస్తున్నాయి. ఈ రైలు హౌరా నుండి సికింద్రాబాద్ కు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.ఈ ప్రమాద ఘటనపై రైల్వే శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు సుమారు 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉందని, భువనగిరి సమీపంలోకి రాగానే రైలు స్పీడ్ తగ్గిన క్రమంలో మంటలను గుర్తించారని సమాచారం. ప్రస్తుతం రైలులోని ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీలు దగ్ధం అయ్యాయని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+