తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ(స్మార్ట్ గవర్నెన్స్) ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు.
సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) ముఖ్య కార్యదర్శిగా బెనహర్ మహేశ్ దుత్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ శరత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి నియమితులయ్యారు.

విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీశ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బడ్జెట్ సమావేశాలపై సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు
జులై 23 నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచరంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు.
తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. నోట్ ఆన్ డిమాండు, రూపొందించిన బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని, తద్వారా సభ్యులు దానిని పరిశీలించడానికి, చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని అధికారులను కోరారు.
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, కార్యదర్శులు రఘునందన్‌రావు, బుద్ధ ప్రకాష్ జ్యోతి, వి కరుణ, లోకేష్ కుమార్, సిఐపిఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications