వర్షంలో తడుస్తుంటే: ఇంట్లోకి పిలిచాడు.. ఊహించని ఘటనతో దిగ్భ్రాంతిలో ఆమె..

వర్షంలో తడుస్తున్న ఆమెను ఇంట్లోకి పిలిచి ఆశ్రయం ఇచ్చి రేప్ చేశాడు.

హైదరాబాద్: వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం ఏదో పని నిమిత్తం తెలిసినవారి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో.. మార్గమధ్యలో జోరు వాన మొదలైంది. దీంతో దారిలో ఉన్న ఓ ఇంటి ముందు నిలబడింది.

tribal woman allege rape by a tribe man in rajendranagar

వర్షం మరింత జోరందుకోవడంతో ఆమె తడవడం మొదలైంది. ఇది గమనించిన ఆ ఇంటి వ్యక్తి రాజునాయక్‌(23)ఆమెను ఇంట్లోకి పిలిచాడు. తాను కూడా గిరిజనుడినే అని పరిచయం చేసుకుని అదే భాషలో మాట్లాడాడు. దీంతో అతని మాటలు నమ్మి ఆమె ఇంట్లోకి వెళ్లింది.

కాసేపటికే.. ఇంటి తలుపులు మూసేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ గిరిజన మహిళపై రాజు నాయక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహించని ఘటనతో బాధితురాలు దిగ్భ్రాంతికి గురైంది. బాధితురాలు శనివారం రాత్రి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+