వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ తప్పవు.!మంత్రి హరీష్ రావుపై మండిపడ్డి జగ్గారెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు పై సంగారెండ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. తోటి ప్రజా ప్రతినిధులను అసలే పట్టించుకోని హరీష్ రావు మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంగంలో ఉండే సరికి వారిని ఇంటి బంధవుల్లాగా చూసుకుంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా సంగారెడ్డి లోని టీఎన్జిఓఎస్ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఈ సందర్బంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు కి ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రబుల్ మొదలయ్యాయని, కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డిని నిలబెట్టడం వల్ల నైతికంగా ఉమ్మడి మెదక్ జిలాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టడంతో హరీష్ రావు స్థానిక నేతలను సొంత అల్లుడ్లుగా, సొంత బిడ్డలుగా చూసుకున్నారని ఎద్దేవా చేసారు.

Trouble shooter in troubles.!Jaggareddy lashes out at Minister Harish Rao!

కాంగ్రెస్ పార్టీ క్యాంప్ లు పెట్టే పరిస్థితిలో లేదని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా, ఏడు వందల పైచిలుకు ప్రజా ప్రతినిదులు ఉండి కూడా క్యాంప్ రాజకీయాలకు తెర లేపిందని, ఇది అత్యంత దారుణమని జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిలాల్లో యూనానిమస్ కావొద్దనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి ని బరిలో పెట్టడం జరిగిందని అన్నారు. కేవలం 230మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 230 ఓట్లు మాత్రమే కాకుండా మరో 170 ఓట్లు వస్తాయని ఆశిస్తున్నానని జగ్గా రెడ్డి తెలిపారు.

Trouble shooter in troubles.!Jaggareddy lashes out at Minister Harish Rao!

ఇక ఆ పై ఏమైనా ఉంటే అది దైవ నిర్ణయమని అన్నిరు. కాంగ్రెస్ పార్ట్ అభ్యర్థిని పెట్టడంతో టీఆర్ఎస్ పార్టీ కి గుబులు పట్టుకుందని, గతంలో కూడా ఉమ్మడి మెదక్ జిలాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీది పైచేయిగా ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కు 8 స్థానాలు ఉండొచ్చు కానీ రేపు మరోసారి సంఖ్య కాంగ్రెస్ కి వచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలిపారు జగ్గారెడ్డి.

English summary
Sangareddy Congress MLA Jaggareddy was once again angry with Finance Minister Harish Rao. Harish Rao Medak, who did not really care about his fellow public representatives, was incensed that when the Congress candidate was in the field in the MLC elections, they were being treated like housemates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X