టీఆర్ఎస్, బీజేపిలు మోసం చేసే పార్టీలు.!ప్రజల పక్షాన పోరాడేది కాంగ్రెస్ మాత్రమేనన్న జగ్గారెడ్డి.!

హైదరాబాద్ : పెట్రోల్బ్,డీజల్,గ్యాస్ నిత్యావసర ధరల పెంపుకు నిరసనగా ఏఐసీసీ అదేశాల మేరకు అమేథీ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రకు మద్దతుగా సంగారెడ్డిలో పాదయాత్రకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, శ్రీకారం చుట్టారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్ధిక భారం పెద్దఎత్తున పడిందని, డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో మూడేళ్ళుగా ఉద్యమం చేస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. కానీ బీజేపీ, టీఆరెస్ ప్రభుత్వాలు ధరలు తగ్గించకుండా మొండి వఖరి అవసంభిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఈ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల ఇబ్బందులను గమనించి ధరలు తగ్గించాలని పాదయాత్ర చేస్తున్నారని జగ్గారెండ్డి స్పష్టం చేసారు.

TRS, BJP are cheating parties!Jaggareddy says Congress the only party fought for the people.

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ పెంచిన గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలను తగ్గిస్తామని రాహుల్ గాంధీ అనేక సార్లు చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల కుటుంబానికి ప్రజలకు హామీ నెరవేర్చకుండా ఉండని తత్వం ఆ కుటుంబానిదని అన్నారు. ఇది ప్రజలు గమనించాలని అన్నారు. అంచెలంచెలుగా బీజేపీ ప్రజలకు విషంతో కూడుకున్న భోజనం తినిపిస్తున్నారని, ప్రజలకు తెలీకుండానే ధరలు పెంచి భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుందని, టీఆరెస్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ పై రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. దేవుడు పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్తే వీళ్ళు భారం మోపుతున్నారని, అలాగే వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్తుందని, పంట వేయొద్దని టీఆరెస్ చెప్తుందని అన్నారు. ఏది ఏమైనా సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.

TRS, BJP are cheating parties!Jaggareddy says Congress the only party fought for the people.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+