అంబేద్కర్ ను పట్టించుకోని టీఆర్ఎస్.!కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న బండి సంజయ్.!
ఢిల్లీ/హైదరాబాద్ : రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించారు తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళుతోందని, కాంగ్రెస్ పార్టీ ఏనాడూ అంబేద్కర్ ను పట్టించుకోలేదని మండిపడ్డారు. అంబేద్కర్ కి భారత రత్న ప్రకటించింది బీజేపీ ప్రభుత్వమేనని, రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలంటూ అంబేద్కర్ పేరిట స్ఫూర్తి భవనాలు నిర్మించామన్నారు సంజయ్. అంబేద్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తోందని గుర్తు చేసారు.

అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు గుర్తుకు రాని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావంటూ మండిపడ్డారు. అంబేద్కర్ కు ఏనాడూ నివాళులు అర్పించని వ్యక్తి చంద్రశేఖర్ రావని, ముఖ్యమంత్రి ఏమి పీకుతున్నారని, ఫాంహౌస్ లో బిజీగా ఉన్నావా అంటూ ప్రశ్నించారు. రాజుకు తగ్గట్టు అధికారులు అలాగే వ్యవహరిస్తారని, అంబేద్కర్ వర్ధంతి, జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చంద్రశేఖర్ రావు పూలమాల వేసి ఎందుకు నివాళులు అర్పించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి పరిపాలిస్తున్నాడని, పేదల పాలిట యముడిలా తయారైయ్యారని చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. దళిత బంధు ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, ఇవ్వకుండా అన్ని అబద్ధాలు చెప్పి దగా చేసారని మండి పడ్డారు. ఎన్నికల సమయంలో జై భీమ్ జై దళిత్ అంటాడని, ఎన్నికల తరువాత దళితులను పట్టించుకోని నాయకుడు చంద్రశేఖర్ రావు అని, భారతీయులకు, తెలంగాణ ప్రజలకు చంద్రశేఖర్ రావు క్షమాపణ చెప్పాలని బండి సజయ్ నిలదీసారు.












Click it and Unblock the Notifications