సోషల్ మీడియాలో నాది, నా కూతురు ఫోటో పెట్టి ప్రచారం: కెకె
శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్‌లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్‌లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
దండుమైలారం గ్రామంలో మాత్రం భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. శంషాబాద్ ప్రాంతంలో తనతో పాటు తన కుమార్తె ఫోటో పెట్టి కొందరు మీడియాలో వార్తలు రాశారన్నారు. కొందరు కావాలనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

దండుమైలారంలో భూముల కొనుగోలు ఒప్పదం 2013లో జరిగిందని, అప్పుడు తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నానని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతనే తాము దండుమైలారంలో భూములు కొన్నామన్నారు.












Click it and Unblock the Notifications