రోడ్డు ప్రమాదం: కారు తుక్కు తుక్కు, తెరాస నేత దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని నార్కట్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చిట్యాల మండల నేత దుబ్బాక సతీష్ రెడ్డి (48) దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలోని నార్కట్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చిట్యాల మండల నేత దుబ్బాక సతీష్ రెడ్డి (48) దుర్మరణం పాలయ్యారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డస్టర్ వాహనం ఢీ కొట్టడంతో సతీష్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. నల్లగొండ నియోజకవర్గ తెరాస ఇంచార్జి దుబ్బాక నర్సింహరెడ్డికి సోదరుడు అయిన సతీష్ రెడ్డి విశాఖపట్నం నుంచి చిట్యాలకు వస్తుండగాప్రమాదం జరిగింది.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. తన సొంత పనుల నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన సతీశ్‌రెడ్డి తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి వద్ద ఈ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిప్పుడు స్థానికులు 108 సిబ్బందికి సమచారమందించారు. అయితే స్పందించకపోవడంతో సతీశ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సతీష్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారు ముందు భాగం తుక్కు తుక్కు అయింది. అది ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
సతీష్ రెడ్డి భార్య మమత నెరడ ఎంపిటిసిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి నకిరేకల్ తెరాస శాసనసభ్యుడు వేముల వీరేశం చేరుకున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications