వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కోసం ఆశావహుల ఎదురుచూపు: గులాబీ దళంలో గుబాళించేదెవరో?

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం జిల్లా కార్యవర్గం ఎంపికను జాప్యం చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. గత పదిహేను రోజుగా ప్రకటన వెలువడుతుందని వేచి చూస్తున్న ఆశావహులకు ఏ రోజుకు ఆ రోజు నిరాశే మిగులుతోంది.

కార్యవర్గ ఎంపికపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలతో ప్రతి రోజు చర్చించడం ఏదో కారణం చూపుతూ ప్రకటనను జాప్యం చేస్తూ వస్తుండటం విశేషం. జిల్లా పార్టీ అధ్యక్షు ఎంపిక పూర్తయినప్పటికీ మిగతా అనుబంధ సంఘం అధ్యక్షులు ఎంపికతో పాటు కార్యవర్గ సభ్యుడు ఎంపిక ఒక కొలిక్కి రవడం లేదని పార్టీ వర్గాల సమాచారం.

పూర్తిస్థాయి జిల్లా పార్టీ కార్యవర్గాలను ప్రకటించానే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. కార్యవర్గం ఎంపిక విషయంలో ఆయా జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ మధ్య సమన్వయం లోపంతోనే జాబితా ఫైనల్‌ కావడం లేదనే ఆరోపణు సైతం వినిపిస్తున్నాయి.

గ్రామీణ జిల్లా కార్యవర్గం కేవలం 15 మందితో, అర్బన్‌ జిల్లా కార్యవర్గం 24 మందితో కమిటీు వేయానే నిర్ణయం కూడా ప్రజాప్రతినిధులకు తనొప్పిగా మారినట్లు తెలిసింది. మొత్తంగా కార్యవర్గం ఎంపిక ప్రకటన జాప్యం అవుతుండడతో ఆశావహులు గురవుతున్నారు.

కార్యవర్గంలో తమకు చోటు దక్కుతుందనే ధీమాతో ఉన్నవారు సైతం ప్రకటన జాప్యంతో తుది జాబితాలో తమ చోటు పదిమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 TRS leaders are waiting for Executive Committee

ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఎదుట పడిగాపు

పార్టీ పదవు కోసం ఆశావహులు ఎమ్మెల్యే ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా పార్టీ కమిటీ సంఖ్య పరిమితంగా ఉండటంతో ఎవరికి వారు వారి గాడ్ ఫాదర్‌ ద్వారా కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అనుంబంధ సంఘాల్లో చోటు దక్కే అవకాశం ఉన్నప్పటికీ జిల్లా కార్యవర్గంలో చోటు సంపాదించానే లక్ష్యంతో ముమ్మరంగా ప్రయత్నాు చేస్తున్నారు.

ప్రకటన జాప్యం అవుతుండటంతో కార్యవర్యంలో చోటు కోసం పోటీ ఎక్కువ అవుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే, ఎంపీ స్థానికంగా ఉన్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి కార్యక్రమాల్లో పాల్గొనడం, హైదరాబాద్‌ వెళ్తే అక్కడి కూడా వెళ్లి వారి మెప్పు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ముఖ్యంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా పార్టీ కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుగా పువురు పోటీ పడినప్పటికీ స్థానిక సీనియర్‌ నేత, న్యాయవాది గుడిమళ్ల రవికుమార్‌ పేరును అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. మిగతా కార్యవర్గం కోసమే జిల్లా నేత మధ్య కసరత్తు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

English summary
TRS leaders are waiting for Executive Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X