స్పెల్లింగ్ తప్పురాసి కెటిఆర్‌కు దొరికిపోయిన డిగ్గీ, బాబుకు చురకలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌‌కు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం నాడు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. డిగ్గీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ స్పెలింగ్ రాయడానికి రాని దిగ్విజయ్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శించడం విడ్డూరమని, అది సరికాదన్నారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ ప్రజలకు దిగ్విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే దిగ్విజయ్ తెలంగాణ స్పెలింగ్ తప్పు రాశారు.

చంద్రబాబుకు నాయిని చురకలు

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కడుపుమంటగా ఉందని, అందువల్లే సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసిందే నీళ్లు, నిధుల కోసమన్నారు. నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. ఆయనకు కడుపుమంట మంచిది కాదన్నారు. తెలంగాణలోని ఆంధ్రా ప్రజలంతా తెలంగాణ వాసులేనని చెప్పారు. అయితే, ఇక్కడి వారి పొట్టగొట్టేందుకు చూస్తున్న వారంతా శత్రువులేనన్నారు.

 TRS leaders Nayini, KTR counter to TDP and Congress

టిడిపిపై గట్టు రామచంద్ర రావు ఫైర్

తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని తెరాస నేత గట్టు రామచంద్ర రావు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని టీడీపీ, కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆ రెండు పార్టీలు అరవై ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను యావత్ దేశం మెచ్చుకుంటుందన్నారు. కేసీఆర్ దీక్షను విమర్శించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొమ్మిదేళ్ల వరకు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదన్నారు. వందలాది మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైందన్నారు. కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ది.. కుతంత్రాల చరిత్ర టీడీపీది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+