టీఆర్ఎస్ మహా ధర్నా: విచిత్ర వేషధారణలో ఎమ్మెల్యే సండ్ర, బండి సంజయ్ తో పాటు కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

తెలంగాణా రాజకీయాలు ధాన్యం కొనుగోళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి .యాసంగిలో వరి సాగు చెయ్యొద్దు అని అధికార టీఆర్ఎస్ చెప్పడంతో మొదలైన రగడ, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని అధికార పార్టీ టార్గెట్ చేసే దాకా వెళ్ళింది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అందుకే వరిసాగు చెయ్యొద్దని చెబుతున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపిని టార్గెట్ చేస్తుంది. ఏకంగా టీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహిస్తూ కేంద్రం తీరుకు నిరసన వ్యక్తం చేస్తుంది. సాక్షాత్తూ తెలంగాణా సీఎం ధర్నాలో పాల్గొనటం ఇది మొదటిసారి.

టీఆర్ఎస్ మహా ధర్నా.. ప్రధాన ఆకర్షణగా నిలిచినా ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించటం కోసం, తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ రైతుల మహాధర్నా ను నిర్వహిస్తోంది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడడం కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు. అందులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ రైతుల మహాధర్నాలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఒళ్లంతా వడ్ల కంకులతో, భుజంపై నాగలి పెట్టుకుని నిరసన

ఒళ్లంతా వడ్ల కంకులతో, భుజంపై నాగలి పెట్టుకుని నిరసన


తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ నిర్వహించిన రైతుల మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని మహాధర్నాలో పాల్గొన్న నేతలకు స్వాగతం పలికారు. రైతుల మహాధర్నాలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రం తెలంగాణా రైతాంగ గోడును వినిపించుకోవాలని, లేదంటే సమరమే అంటూ ధర్నా వేదికగా తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రైతుల మహా ధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేకంగా కనిపించారు. కేంద్రానికి తమ డిమాండ్ తెలిసేలా, రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఆయన ఒళ్లంతా వడ్ల కంకులతో అలంకరణ చేసుకున్నారు. భుజంపై నాగలి పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

కేంద్రం తీరుపై మండిపడిన మంత్రి నిరంజన్ రెడ్డి


కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోవాలని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తమ డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో పాల్గొన్నారు. మహాధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలను సృష్టించిందని, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం మహాధర్నా చేపట్టామని, సాక్షాత్తు సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల కోసం మహాధర్నాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. కేంద్రం అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నిరంజన్ రెడ్డి, ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం లేదంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న మంత్రి

కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న మంత్రి

రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రాజెక్టులు కట్టడంతో బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు వంటి పథకాలతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నాయకుల తీరుపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాగు గురించి బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి నేతలపై ఆరోపించారు.

కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు .. బండి సంజయ్ కి బండి లేదు

కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు .. బండి సంజయ్ కి బండి లేదు

కిషన్ రెడ్డికి ఎడ్లు లేవని, బండి సంజయ్ కి బండి లేదని ఎద్దేవా చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదే అని తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, లేదంటే కేంద్రమే నష్టపోతుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఇందిరాపార్క్ వద్ద టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహాధర్నాలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. ఇక టిఆర్ఎస్ మహాధర్నా గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+