Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీమంత్రి జూపల్లి ఇంటికి బయలుదేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ అరెస్ట్.. కొల్లాపూర్లో ఉద్రిక్తత!!

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆదివారం ఉదయం నుంచి హై టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ తాజా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారి రచ్చకెక్కిన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి, అవినీతి పై ఇద్దరి మధ్య కొనసాగిన మాటల యుద్ధం సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకునే దాకా వెళ్ళింది. శనివారం ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాళ్ళు విసురుకుని కొల్లాపూర్ కు చేరుకున్నారు.

 టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్

తమ బహిరంగ చర్చకు ఈరోజు అనుమతి కావాలని ఇరు వర్గాల నుండి దరఖాస్తులు వచ్చినప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వాటిని తిరస్కరించారు. తాజా పరిణామాల నేపధ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. కొల్లాపూర్ లో అంబేద్కర్ విగ్రహం వద్దకు కాకుండా ఆయన ఇంటికి వెళ్లి చర్చిస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మొదట నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే బారికేడ్లను తోసుకుంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 బీరం వర్గీయుల ఆందోళన.. పలువురు అరెస్ట్

బీరం వర్గీయుల ఆందోళన.. పలువురు అరెస్ట్

ఈ క్రమంలో పోలీసుల వాహనాన్ని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ని వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు వాహనం వెంట భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. అయితే పోలీసులు ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను పెద్దకొత్తపల్లి కి తరలించారు. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు.

ఇంటి గేటు వద్దే వేచిఉన్న జూపల్లి.. బీరంపై మండిపాటు

ఇంటి గేటు వద్దే వేచిఉన్న జూపల్లి.. బీరంపై మండిపాటు

కొల్లాపూర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తన ఇంటికి వస్తానని సవాల్ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని తాను గేటు నుండే స్వాగతిస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఇంటి గేటు వద్ద వేచి నిలుచున్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో చర్చకు రాకుండా తప్పించుకున్నారు అంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కానీ తాను మాత్రం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ గొడవకు పార్టీకి సంబంధం లేదన్నారు. మరో పక్క మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+