ఓటుకు నోటులో దొరికిన దొంగ, రాళ్లతో నిన్నే కొట్టాలి: రేవంత్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలకు టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సాధికారిక ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్..

ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఎవరైతే రాళ్లతో కొట్టమంటున్నారో వాళ్లనే ప్రజలు రాళ్లతో కొడతారని అన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి కాదా? అని చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అంటూ రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డినే ముందుగా రాళ్లతో కొట్టాలి..

రేవంత్ రెడ్డినే ముందుగా రాళ్లతో కొట్టాలి..

ముందుగా పార్టీ మారిన రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలని లింగయ్య ఎదురుదాడి చేశారు. స్పీకర్‌కు దొంగ పత్రాలు ఇచ్చి వచ్చాడంటూ ధ్వజమెత్తారు. అంతేగాక, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలను, ధనవంతులను రేవంత్ రెడ్డి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకుని వందలమందిని ఆఫీస్ బేరర్‌లను పెట్టుకుని లక్ష రూపాయల జీతాలు ఇస్తున్నాడని రేవంత్‌పై విమర్శలు చేశారు. రియల్టర్లు ఎక్కడ వెంచర్లు వేస్తే అక్కడ, బిల్లర్లు ఎక్కడ బిల్డింగ్ కడితే అక్కడ వాలిపోయి.. ఆ ప్రాజెక్టుల నుంచి, అధికారుల నుంచి వేల కోట్ల రూపాయలు రేవంత్ దండుకున్నాడని లింగయ్య ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్‌లో ఎవరిని అడిగానా చెబుతారన్నారు.

Recommended Video

    YS Sharmila Party Name : సర్వే రిపోర్ట్.. ఎన్ని సీట్లు ? పార్టీ పేరు మారిందా..? || Oneindia Telugu
    స్థాయికి మించి మాట్లాడితే కుక్కను కొట్టినట్లు కొడతారు..

    స్థాయికి మించి మాట్లాడితే కుక్కను కొట్టినట్లు కొడతారు..

    గతంలో రేవంత్ ఏం చేశాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. అన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయో అందరికీ తెలుసని లింగయ్య అన్నారు. స్థాయికి మించి మాట్లాడితే ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారన్నారు. తగిన సమయంలో తగిన విధంఘా బుద్ధి చెబతారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అంతకుముందు రేవంత్ రెడ్డిపై పలువురు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. రేవంత్ గూండాల మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని, ప్రచారం కోసం రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. గూండాయిజం చేస్తానంటే జైలుకు పోతావు అంటూ రేవంత్ రెడ్డిని గట్టిగా హెచ్చరించారు సుధీర్ రెడ్డి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+