గల్ల పట్టుకోని అడగండి: గాదరి, ప్రపంచ బ్యాంక్ సర్వేపై విశ్వేశ్వరరెడ్డి ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలతు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల విషయంలో ధర్నాలు చేయకూడదన్నారు.
దమ్ము, ధైర్యముంటే చంద్రబాబు నాయుడు గల్ల పట్టుకొని అడగాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు స్మార్ట్‌సిటీలు అవసరం: ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
దేశ వ్యాప్తంగా మారుతున్న ప్రజల జీవనశైలికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల అవసరం ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృష్టి చేస్తోందని అన్నారు.
మంగళవారం హోటల్ పార్క్ హయత్‌లో 'స్మార్ట్ సొల్యూషన్స్-స్మార్ట్ సిటీస్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ సర్వే ఏడాది క్రితం నిర్వహించిందన్నారు.
ప్రస్తుతం అదే సర్వేని నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం తొలి ఐదు స్థానాల్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో పాటు, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ పాల్గన్నారు.
స్మార్ట్‌సిటీల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications