ఎమ్మెల్యేవైతే ఏంది... గువ్వల బాలరాజ్‌కు పోలీసులు దిమ్మతిరిగే షాక్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నాగర్ కర్మూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా పోలీసులతోనే కయ్యానికి కాలు దువ్వారు. పోలీసులను ఏంట్రా అంటూ పరుష పదజాలంతో దూషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడని, ఆయన గెలిస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన గువ్వల బాలరాజు ఆలోచన లేకుండా ఆవేశంతో మాట్లాడారు. దీంతో గూబ గుయ్యిమనేలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సమాధానమిచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సవాల్ చేసి పరువు పోగొట్టుకున్న గువ్వల బాలరాజు

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సవాల్ చేసి పరువు పోగొట్టుకున్న గువ్వల బాలరాజు

ఆ తరువాత గువ్వల బాలరాజు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అంతేకాదు ఇప్పటికే అనేకమంది గువ్వల బాలరాజు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజీనామా చెయ్యలేక, తాను చేసిన సవాల్ పై నిలబడలేక ఇబ్బంది పడుతున్న గువ్వల బాలరాజు పరువు పోగొట్టుకున్నాడు. ఇక ఈ వివాదం నుండి గువ్వల బాలరాజు బయటపడక ముందే పోలీసులతో గొడవపడి మరో వివాదంలో చిక్కుకున్నారు.

పోలీసులను ఏంట్రా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే

పోలీసులను ఏంట్రా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశదినకర్మ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించటం కోసం మహబూబ్ నగర్ కి వెళ్ళిన క్రమంలో సీఎం వాహనం వెనుక తన వాహనాన్ని అనుమతించకపోవడంతో ఎమ్మెల్యే బాలరాజు పోలీసులపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాన్వాయ్ వెంట అన్ని వాహనాలకు అనుమతి లేదని చెబుతున్నా వినిపించుకోకుండా ఏంట్రా నన్నే ఆపుతావా అంటూ స్థానిక సిఐ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. నోరుజారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పోలీసులు షాక్ ఇచ్చారు.

బాలరాజుకు చుక్కలు చూపించిన పోలీసులు

ఏంట్రా అంటారా అంటూ పోలీసులు బాలరాజుకు చుక్కలు చూపించారు. మీరు ఎమ్మెల్యే అయితే మాత్రం పోలీసులను రా అంటారా అంటూ మండిపడ్డారు. మీకా అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు.మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. అధికారులకు మీరు ఇచ్చే విలువ ఇదేనా, కొంచెం మంచిగా మాట్లాడండి.. రా అన్నంత మాత్రాన మీ గౌరవమేమీ పెరిగిపోదు అంటూ ఖాకీలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

దీంతో అంతమంది అనుచరుల ముందు గువ్వల బాలరాజు ఖంగుతిన్నారు. అనవసరంగా పోలీసులను ఏంట్రా అని పిలిచి వారితో నాలుగు మాటలు అనిపించుకున్నాడు. ఇక ఈ వ్యవహారం సీరియస్ అవుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేను అనునయించి అక్కడి నుండి పక్కకు పంపించారు.

బాలరాజు ఆవేశం, నోటి దురద కొంప ముంచుతుందని చర్చ

బాలరాజు ఆవేశం, నోటి దురద కొంప ముంచుతుందని చర్చ

బాలరాజు ఆవేశమే బాలరాజును వివాదాలలోకి దించుతుందని రాజకీయవర్గాలలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని బాలరాజు వ్యవహారశైలిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే అయినంతమాత్రాన కొమ్ములుండవు అని చర్చిస్తున్నారు.

మొన్న హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కూడా నోటి దురదతోనే బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ఓడిపోతాడని తొందరపడి సవాల్ చేసి తిప్పలు పడుతున్నాడు అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అనవసరం అయిన విషయాల్లో బాలరాజు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని పలువురు హితవు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+