బరువు ఎక్కువవడంతో తెగిన లిఫ్ట్...! ఎమ్మెల్యే మైనంపల్లికి గాయాలు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి లిఫ్టు ప్రమాదంలో గాయపడ్డాడు. నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హజరైన మైనం హనుమంతరావు క్రిందకు దిగుతుండగా ఒక్కసారిగా లిఫ్టు వైర్ తెగిపోవడవంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లిఫ్టులో ఉన్న మైనం పల్లి ఎడమ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను పక్కనే ఉన్న యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

వివరాల్లోకి వెళితే గాంధీనగర్‌లోని ఎర్రం శ్రీనివాస్ అనే కార్యకర్త ఇంట్లో ఫంక్షన్‌కు హజరయ్యాడు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో లిఫ్టు తెగిపడింది. అయితే అదృష్టవశాత్తు లిఫ్టు పూర్తిగా క్రిందకు వచ్చిన తర్వాత వైర్ తెగడంతో ఒక్కసారిగా కుదుపుకు గురి అయింది. ఈనేపథ్యంలోనే లిఫ్టులో ఉన్నవారు క్రిందపడి పోయారు.దీంతో ఆయనకు కాలికి గాయాలయ్యాయి.
ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయాలయినట్టు యశోద వైద్యులు తెలిపారు. కాగా గాయపడిన ఎమ్మెల్యేను మంత్రి మల్లారెడ్డితోపాటు ,ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు.












Click it and Unblock the Notifications