వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేలతో గులాబీ ఎమ్మెల్యేల గుబులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేల ఎదురీత తప్పదా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే టెన్షన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏ పార్టీకి ఆ పార్టీ నిర్వహిస్తున్న సర్వేలతో పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా అన్ని జిల్లాలలో అలజడి కొనసాగుతోంది. ఇక ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అన్న ఆందోళన పీక్స్ కు చేరింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం సీట్లలో టీఆర్ఎస్ ఓటమి .. సర్వే రిపోర్ట్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం సీట్లలో టీఆర్ఎస్ ఓటమి .. సర్వే రిపోర్ట్


వరంగల్ జిల్లా అధికార పార్టీ నేతల్లో ఆందోళన కొనసాగుతుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వరుసగా వస్తున్న సర్వే రిపోర్టులు గుబులు పుట్టిస్తున్నాయి. సగం సీట్ల వరకు ఓటమి తప్పదని సర్వేలు తేల్చడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏవిదంగా ముందుకు వెళితే బాగుంటుందనే దానిపై టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ కు ఐప్యాక్ రిపోర్ట్

సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ కు ఐప్యాక్ రిపోర్ట్


వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం 11సెగ్మెంట్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ సగం సీట్లను కోల్పోవడం ఖాయమని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆరా సంస్థ చేసిన సర్వేతో పాటు, ఆత్మసాక్షి చేసిన సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఇక ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ కు ఇప్పటికే స్పష్టమైన నివేదిక ఇచ్చింది.

టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి

టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందని తేల్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉందని సర్వేలో తేల్చారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతుందని, కొంత మంది ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏక్షణమైనా సదరు నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు టచ్ లో రేవంత్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు టచ్ లో రేవంత్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఈ ముఖ్యమైన నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం.వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే కసరత్తు చేస్తుందని సమాచారం. చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో విస్తరించడం టీఆర్ఎస్ కు రుచించడం లేదు. ఇప్పుడు ఈ విషయమే అధికార పార్టీ నేతల గుబులుకు అసలు కారణంగా మారింది.

ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదు

ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదు


పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్ లో ఎమ్మెల్యే రెడ్యానాయక్... ఈ నలుగురు ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నారని సర్వేలతో పాటు పొలిటికల్ టాక్ నడుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్... ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదని సర్వేలతో పాటుగా స్థానిక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం.. ఆ ఎమ్మెల్యేలకు టెన్షన్

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం.. ఆ ఎమ్మెల్యేలకు టెన్షన్


ఆరా సంస్థ, ఆత్మసాక్షి సర్వేలతో పాటు ఐప్యాక్ సర్వేలు, రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగాల సర్వేల ఆధారంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టికెట్ల విషయంలో ముందుకు పోయే అవకాశం ఉందని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం నెలకొన్న స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని, అందుకు కసరత్తు కూడా జరుగుతుందని సమాచారం. దీంతో స్థానిక ఎమ్మెల్యే లలో ఇప్పటి నుండే టెన్షన్ కొనసాగుతుంది. ఏది ఏమైనా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్ పార్టీ సగం సీట్లను కోల్పోతుందనే సర్వే రిపోర్టులు సంచలంగా మారడంతో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం పై పట్టు సాధించడం కోసం నానా తంటాలు పడుతున్న ట్లుగా సమాచారం.

English summary
With the surveys, trs party leaders facing tension. In the joint Warangal district, there is tension in seven MLAs about their tickets in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X