మొనగాడివయ్యావా, నాలుక చీరేస్తాం: రేవంత్ రెడ్డిపై సుమన్

కరీంనగర్: "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగు లకు మడుగులొత్తే నువ్వు, తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్‌ను విమర్శించే మొనగాడివయ్యావా? ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడు. లేకుం టే నాలుక చీరేస్తాం" అని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నడిపే కథ లో పాత్రధారుడైన రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి వచ్చే రాతప్రతులు చదువుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న రేవంత్‌రెడ్డికి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, ఆ కుటుంబం చేసిన త్యాగాలు తెలిసేవన్నారు.

మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితలకు పదవులు ఒక్కసారిగా వచ్చినవి కావని, ఉద్యమంలో చేసిన త్యాగాలకు ప్రజలిచ్చిన కితాబులన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అనుకుంటే ప్రజలు ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ఏదో ఒకనాడు తెలంగాణ నిరుపేద బిడ్డలు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు.

Balka Suman

ఓటుకు నోటు కేసులో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ ఘటనతోనైనా టీడీపీ నేతలకు కనువిప్పు కలగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హితవుపలికారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దగుల్బాజీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు సంచులు ఎరచూపి ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించి ఏసీబీకి చిక్కిన విషయాన్ని మరువొద్దన్నారు.

రేవంత్‌రెడ్డి మూర్ఖుడు, రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు పంచన చేరి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరు ఖమ్మం జిల్లా ఇల్లెందులో మీడియాతో మాట్లాడారు. రేవంత్ పిచ్చిపట్టినవాడిలా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఎన్నిరోజులకైనా రేవంత్‌రెడ్డికి జైలు కూడు తప్పదన్నారు.

అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి బెయిల్‌పై బయటకొచ్చి సంబురాలు చేసుకోవడం హస్యాస్పదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్‌లో ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. నీతిలేని రాజకీయాలతో దేశం ముందుకెళ్లదని, కొన్ని పార్టీలకు నైతిక విలువలు లేకుండా పోయాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+