కేసీఆర్, చంద్రబాబుల వల్లే, ప్రధానులు వారే కాబట్టి వివక్ష: ఎంపీ కవిత
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల కారణంగా తెలుగువాణిని అందరు గుర్తిస్తున్నారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల కారణంగా తెలుగువాణిని అందరు గుర్తిస్తున్నారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రెండు పార్టీల వ్యవస్థ ఆలోచనలకు స్వస్తి పలికి ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలని కవిత అన్నారు. ఆ దిశగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అలాగే, బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
మాకే జాత్యాహంకారం ఉంటే దక్షిణ భారత దేశంలోని నల్లవారితో ఎలా కలిసి ఉంటామని, శ్రీకృష్ణుడు కూడా నల్లనివాడే అని తరుణ్ విజయ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

ఉత్తరాదిన ఎంపీల సంఖ్య ఎక్కువ అని, జనాభా ఎక్కువ అని, కాబట్టి ప్రధానమంత్రులు అక్కడి నుంచి ఎన్నికవుతున్నారని, కాబట్టే ఈ వివక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతీయ పార్టీలు వచ్చాకే ప్రాంతీయ సమస్యలకు గుర్తింపు వచ్చిందన్నారు. ప్రజలు దీనిని గుర్తించి ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలుగు వాణిని బలంగా వినిపిస్తున్నారన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications