వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ అనుకున్నదొకటి.. అవుతున్నదొకటి; చివరకు పర్యవసానం ఏమిటో!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీతో దూకుడుగా ముందుకు వెళ్తున్న వైయస్ షర్మిల కు చెక్ పెట్టడం కోసం టిఆర్ఎస్ తీసుకువచ్చిన లోకల్ సెంటిమెంట్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అవుతుందా అన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం కోసం రంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించిన గులాబి వస్ కేసీఆర్ కు షర్మిల విషయంలో చోటుచేసుకున్న ఘటనలతో కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది.

వైఎస్ షర్మిల ఎపిసోడ్ రేపిన దుమారం.. నాన్ లోకల్ వాదం చేస్తున్న గులాబీ దళం

వైఎస్ షర్మిల ఎపిసోడ్ రేపిన దుమారం.. నాన్ లోకల్ వాదం చేస్తున్న గులాబీ దళం

టిఆర్ఎస్ పార్టీ అనుకున్నది ఒకటి అయితే అవుతుంది ఇంకొకటి అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సమైక్యవాదుల దాడులు, ఆక్రమణలకు కుటిల యత్నాలు అంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు వైయస్ షర్మిల ఎపిసోడ్ తో మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన వ్యక్తి అయిన వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి రాజకీయంగా పోరాటం చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తప్పు పడుతోంది. అంతే కాదు వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆమెను అరెస్టు చేసిన ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

షర్మిల ఇక్కడ రాజకీయం చెయ్యకుంటే మీరెలా దేశ వ్యాప్తంగా రాజకీయం చేస్తారని ప్రశ్న

షర్మిల ఇక్కడ రాజకీయం చెయ్యకుంటే మీరెలా దేశ వ్యాప్తంగా రాజకీయం చేస్తారని ప్రశ్న


దీంతో బిజెపి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా వైఎస్ షర్మిల అరెస్టును తీవ్రంగా ఖండించి ఆమెకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సైతం వైయస్ షర్మిల ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇక ఈ సమయంలో వైయస్ షర్మిల ను ఆంధ్ర అంటూ ముద్రవేసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసేలాగా మారుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తీసుకువస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు, ఇక ఇదే ధోరణి కొనసాగిస్తే దేశవ్యాప్తంగా ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలంగాణా సెంటిమెంట్ తో టీఆర్ఎస్ కు నష్టం?.. జగన్ కు లాభం?

తెలంగాణా సెంటిమెంట్ తో టీఆర్ఎస్ కు నష్టం?.. జగన్ కు లాభం?

బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, వేరే ప్రాంతాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి, ప్రజల్లోకి వెళ్లడానికి వీల్లేదని చెబితే, మరి కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా పోటీ చేయడానికి వెళ్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణా సెంటిమెంట్ ని తీసుకువచ్చి పదేపదే ఆంధ్ర అంటూ వ్యాఖ్యలు చేయడం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే కేసీఆర్ కు అక్కడి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని మరో చర్చ జరుగుతుంది. ఇది జగన్ కు లాభిస్తుందని చర్చ జరుగుతుంది.

షర్మిలపై నాన్ లోకల్ అస్త్రం పర్యవసానం ఏమవుతుందో?

షర్మిలపై నాన్ లోకల్ అస్త్రం పర్యవసానం ఏమవుతుందో?

తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు రావడంతో బీఆర్ఎస్ ను అక్కడి ప్రజలు ఆదరించడం కష్టం అన్న భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న టిఆర్ఎస్ ప్రాంతీయతత్వంతో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అయ్యే పరిస్థితి కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో చోటుచేసుకుంటున్న రచ్చ పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణాలో ఆంధ్రా పెత్తనం ఏంటి? వైఎస్ షర్మిలపై యుద్ధానికి టీఆర్ఎస్ నాన్ లోకల్ అస్త్రం!!తెలంగాణాలో ఆంధ్రా పెత్తనం ఏంటి? వైఎస్ షర్మిలపై యుద్ధానికి టీఆర్ఎస్ నాన్ లోకల్ అస్త్రం!!

English summary
The question arises as to how the TRS party, which is using a non-local weapon against YS Sharmila, will form a BRS in the country and how they compete in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X