Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ టికెట్ లొల్లి: ఖానాపూర్ లో నువ్వా నేనా.. రేఖానాయక్ వర్సెస్ జనార్ధన్ రాథోడ్!!

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో నువ్వానేనా అన్నట్టుగా అధికార పార్టీ నేతలు తలపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం లోనూ ఎమ్మెల్యే రేఖ నాయక్ వర్సెస్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ అన్నట్టుగా పోరు సాగుతుంది.

ఖానాపూర్ లో నువ్వా నేనా అంటున్న గులాబీ నేతలు

ఖానాపూర్ లో నువ్వా నేనా అంటున్న గులాబీ నేతలు

ఖానాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రేఖ నాయక్ నియోజకవర్గం పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే టికెట్ తానే చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే, ఎమ్మెల్యే రేఖానాయక్ కు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ తనకే దక్కాలని పావులు కదుపుతున్నారు జడ్పీ చైర్మన్ గా ఉన్న జనార్ధన్ రాథోడ్. ఖానాపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేఖ నాయక్, జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది . ఒకరి ఎత్తుగడలకు ఇంకొకరు చెక్ పెడుతూ నియోజకవర్గంలో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక ఇద్దరు నేతల తీరుతో ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ క్యాడర్ రెండు వర్గాలుగా తయారైంది.

టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్

టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్


వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా ఎవరి వర్గం వాదన వారిదే అన్నట్టు రాజకీయం నడుపుతూ ఉండటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరితో సన్నిహితంగా ఉంటే ఏమవుతుందో అన్న ఆందోళన పార్టీ కేడర్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎవరికివారు తమకు టికెట్ దక్కుతుంది అని పావులు కదుపుతుండటం లోకల్ పాలిటిక్స్ ను వేడెక్కిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ టికెట్ కోసం పోటీ పడుతుండడం ఖానాపూర్ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

రేఖా నాయక్ పై స్థానికంగా వ్యతిరేకత, పావులు కదుపుతున్న జనార్ధన్ రాథోడ్

రేఖా నాయక్ పై స్థానికంగా వ్యతిరేకత, పావులు కదుపుతున్న జనార్ధన్ రాథోడ్


కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆసిఫాబాద్ జడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చిన రేఖానాయక్ రాష్ట్ర విభజనకు ముందు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీకి చెందిన రితీష్ రాథోడ్ పై విజయం సాధించారు. 2018 లో వరుసగా రెండోసారి గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమె పై కాస్త స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న జనార్ధన్ రాథోడ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ధీమా లో ఉన్న జనార్ధన్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం లో రాజకీయాలు చేస్తున్నారు.

ఖానాపూర్ లక్ష్యంగా ఉట్నూరుకు మకాం మార్చిన జనార్ధన్ రాథోడ్

ఖానాపూర్ లక్ష్యంగా ఉట్నూరుకు మకాం మార్చిన జనార్ధన్ రాథోడ్


ఆసిఫాబాద్ జనార్ధన్ రాథోడ్ సొంత నియోజకవర్గమైనా అక్కడ ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందువల్ల, పక్క నియోజకవర్గమైన ఖానాపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసమే ఖానాపూర్ నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న ఉట్నూరు లో సొంత ఇల్లు నిర్మించుకున్నారని ప్రచారం జరుగుతోంది.జనార్ధన్ రాథోడ్ నుంచి పోటీ పెరగడంతో ఎమ్మెల్యే రేఖానాయక్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఉపేక్షించకూడదని భావిస్తున్నట్టు సమాచారం.

ఖానాపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ నుండి జనార్ధన్ రాథోడ్ తొలగింపు

ఖానాపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ నుండి జనార్ధన్ రాథోడ్ తొలగింపు


ఖానాపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ నుండి జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ను ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ తొలగించడం కలకలం రేపుతోంది. తనను సోషల్ మీడియా గ్రూప్ నుంచి తొలగించడంతో కొంత అసంతృప్తికి గురైన జనార్ధన్ రాథోడ్ తాడో పేడో తేల్చుకోవాలని యోచనలో ఉన్నారట. ఇప్పటివరకు ఇంద్రవెల్లి, ఉట్నూరుకు మాత్రమే పరిమితమైన జనార్ధన్ రాథోడ్ రానున్న రోజుల్లో జన్నారం, పెంబి, కడెం, దస్తురాబాద్, ఖానాపూర్ మండలాల్లో ప్రాబల్యం పెంచుకుని రేఖ నాయక్ కు చెక్ పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లుగా సమాచారం.

నేతల మధ్య ఆధిపత్య పోరు.. టికెట్ కోసం హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పావులు

నేతల మధ్య ఆధిపత్య పోరు.. టికెట్ కోసం హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పావులు


ఈ ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుంటే హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ నియోజకవర్గం పై పట్టు కోసం ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చాప కింద నీరులా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఇద్దరు అగ్ర నేతలు రేఖా నాయక్ అటు జనార్ధన్ రాథోడ్ బాహాటంగానే ఘర్షణలకు దిగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏజెన్సీ ప్రాంతాలలో వేరువేరుగా నేతలు పర్యటించడం కూడా నేతల మధ్య దూరాన్ని వెల్లడిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుండి బలమైన అభ్యర్థులు లేకపోవడంవల్ల టిఆర్ఎస్ పార్టీ లోనే టికెట్ కోసం కొట్లాట నేతలు కొట్టుకునే దాకా వెళుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+