వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్‌లో టిఆర్ఎస్ కార్పోరేటర్ దారుణ హత్య, పాత కక్షల వల్లే

వరంగల్ కార్పోరేషన్‌*కు చెందిన తెరాస కార్పోరేటర్ అనిశెట్టి మురళిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ కార్పోరేషన్‌*కు చెందిన తెరాస కార్పోరేటర్ అనిశెట్టి మురళిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘాతుకానికి పాతకక్షలు కారణం. ఘటన అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అనిశెట్టి మురళి ఇంట్లోకి చొచ్చుకు వచ్చి నిందితులు దాడికి పాల్పడ్డారు.

ఈ సంఘటన హన్మకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కుమార్‌పల్లిలో చోటుచేసుకుంది. మురళి నగరపాలక సంస్థలోని 44వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు.

warangal

మురళీ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. వరంగల్ నగర టిడిపి అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం తెరాసలో చేరి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

గురువారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ముగ్గురు నిందితులు హన్మకొండ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

రక్తపు మడుగులో పడి ఉన్న మురళీని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ముందస్తు ప్రణాళికతోనే ఆయనపై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు.

ఆయన ఇంట్లో హత్యకు వాడిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేటర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా, అనిశెట్టి మురళీ లష్కర్ బజార్‌కు చెందిన బిన్నీని 25 ఏళ్ల క్రితం హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. బిన్నీ హత్యకు ప్రతీకారంగా బిన్నీ కొడుకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత రెండేళ్లుగా వరంగల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.

English summary
Anishetti Murali 44 year old; Greater Warangal Municipal Corporation 44th Division Corporator from TRS Party was murdered by his enemies today evening between 03:00 to 04:00 at his residence at Kumaraplly of Warangal Urban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X