బిజెపికి కొత్త అధ్యక్షులా: కిషన్‌రెడ్డి, హరిబాబుపై అమిత్ అసంతృప్తి?

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుల పైన అసంతృప్తితో ఉందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా త్వరలో తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని, ఏపీ చీఫ్ కంభంపాటి హరిబాబుల స్థానాల్లో కొత్త వారిని నియమించవచ్చునని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల యూనిట్‌ల పని తీరు పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని అమిత్ షా భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు వారి చర్యలు అంతగా కనిపించడం లేదని భావిస్తున్నారని సమాచారం.

ఇటీవల బెంగళూరులో జరిగిన సమావేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నుండి ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అదే సమయంలో తన అసంతృప్తిని వారి ముందే వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు.

TS, AP BJP to get new chiefs soon

ఇరు రాష్ట్రాల చీఫ్‌ల పని తీరుపై అసంతృప్తితో ఉన్న అమిత్ షా రానున్న అక్టోబర్ నెలలో మార్చేయవచ్చునని తెలుస్తోంది. తెలంగాణలో సమస్యల పైన టిడిపితో కలిసి గళమెత్తాలని అమిత్ షా సూచించినట్లుగా తెలుస్తోంది.

కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీగా ఉన్నారు. అలాగే ఏపీ బిజెపి చీఫ్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశమివ్వవచ్చునని తెలుస్తోంది. ఏపీలో, కేంద్రంలో టిడిపితో కలిసి సాగుతున్నందున కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+