మరో ఇద్దరు ఎమ్మెల్సీల ఖరారు - ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు..!?
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం కేసీఆర్ కేబినెట్- పార్టీ సామవేశాల్లో కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.
మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు. పాలనా పరంగా రానున్న రోజుల్లో కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతున్నారు. అటు బీజేపీ నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని కౌంటర్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది కేసీఆర్ ఆలోచన. ఇదే సమయంలో పార్టీని ఎన్నికల బరిలోకి దించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా నేడు మంత్రివర్గ సమావేశం..రేపు (శుక్రవారం) పార్టీ కీలక భేటీకి నిర్ణయించారు.

కొత్త ఎమ్మెల్సీలకు ఆమోద ముద్ర
పాలనా పరంగా కీలక నిర్ణయాలకు ఈ రోజు జరిగే తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనుంది. అదే సమయంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు అభ్యర్ధులకు ప్రకటించారు. ఆ ముగ్గురు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ మూడు స్థానాలు అగ్ర వర్ణాలకే ఇవ్వటంతో ఇప్పుడు రెండు స్థానాల్లో ఎస్సీ - బీసీ వర్గాలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫరూక్ హుస్సేన్ పదవీ కాలం ముగియనుంది. వారి స్థానం లో పలువురు రేసులో ఉన్నారు. రాజేశ్వర రావును తిరిగి కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమీకరణాలు మారితే ఆయన స్థానంలో టీపీఎస్సీ మాజీ ఛైర్మన్ చక్రపాణికి అవకాశం ఇస్తారని సమాచారం. బీసీ సామాజిక వర్గం కింద బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణ్, బండి రమేశ్, ముక్కా సాంబశివరాజు, పీఎల్ శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఇద్దరి పేర్లకు ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసి గవర్నర్ కు సిఫార్సు చేయనున్నారు.

పాలనా పరంగా కీలక నిర్ణయాలు
ఈ రోజు కేబినెట్ సమావేశంలో పాలనా పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవటం..అదే సమయంలో ప్రజలపైన భారం పడుకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని పైన నేటి సమావేశంలో నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆదాయ వనరుల సమీకరణపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం.. రాబడి పెంపుపై పలు సూచనలు చేసింది. ముఖ్యంగా భూముల అమ్మకం ద్వారా వనరులను పెంచుకోవాలని సిఫారసు చేసింది. ఈక్రమంలోనే ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు జిల్లాల వారీగా భూములను గుర్తించింది. ప్రజావసరాలకు పనికొచ్చే భూములను వదిలేసి, అమ్మకానికి వీలుండే వాటి వివరాలను సేకరించింది. ఈ భూములను ఎప్పుడెప్పుడు ఎలా విక్రయించాలన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దళితబంధుకు నిధుల విడుదల, సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం అమలుపై కూడా చర్చ జరగనుంది. సొంత జాగా లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల యుద్దంలోకి పార్టీ శ్రేణులు
ఇక..ఎన్నికల బరిలోకి పార్టీ శ్రేణులను మొహరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం రేపు (శుక్రవారం) సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య సమావేశానికి నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది.ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్‌లు పాల్గొననున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం..పార్టీ కార్యక్రమాల నిర్వహణ..ప్రతిపక్షాలను తిప్పి కొట్టే వ్యూహాల పైన సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. నేటి కేబినెట్ భేటీ..రేపు జరిగే బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications