తెలంగాణలో వాయిదా పడిన పరీక్షల రీషెడ్యూల్: ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఎప్పుడంటే..?
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన పలు ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటించింది. వాయిదా పడిన ఎంసెట్, ఈసెట్, పీజీ ఈసెట్ తాజా షెడ్యూల్ ఖరారు చేసింది.
జులై 30, 31న ఎంసెట్(అగ్రికల్చర్)ను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈసెట్ ను ఆగస్టు 1న, పీజీఈసెట్ ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తాజా ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మొదట మూడు రోజులు ఆ తర్వాత.. వర్షాలు కొనసాగడంతో మరోసారి సెలవులను పొడిగించారు. ఈ క్రమంలో
జులై 13న నిర్వహించాల్సిన ఈసెట్ ను అధికారులు వాయిదా వేశారు. జులై 14, 15న జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను కూడా విద్యా మండలి వాయిదా వేసింది.
అయితే, జులై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ యథాతథంగా నిర్వహిస్తున్నారు. వాయిదా పడిన ప్రవేశ పరీక్ష
18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications