తెలంగాణ విజయం అమరవీరులకు అంకితం-విపక్షాలకు రేవంత్ కీలక హామీ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నేపథ్యంలో తన ఇంటి నుంచి గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా తరలివచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అక్కడ పార్టీ నేతలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించారు.

డిసెంబర్ 3, 2009లో శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, ఇవాళ అదే రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా సోనియాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇచ్చారన్నారు.

TS Polls: revanth reddy dedicated congress victory to martyrs, key assurance to opposition parties

తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కలిపించి, కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిని నింపిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రాజకీయ నేతలుగానే కాకుండా కుటుంబ సభ్యుల్లా వారు కలిసిపోయారని, ప్రజల్లో విశ్వాసం నింపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భట్టి, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కీ వంటి సీనియర్ నేతల సహకారంతో ఈ విజయం సాధించామన్నారు. తెలంగాణ అమర వీరులకు అంకితం చేస్తున్నామన్నారు. వారి ఆకాంక్షలను నిజం చేయడానికి దీన్ని వినియోగిస్తామన్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచానికే ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వడానికి, మానవ హక్కుల్ని కాపడటానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విపక్ష నేత తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ అవకాశం ఇస్తుందని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలోనూ ప్రతిపక్షాలు పాల్గొనాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

మరోవైపు ఇన్నాళ్లూ తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా పాలనా భవన్ గా మార్చబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 24 గంటల పాటు సామాన్యల కోసం దాని తలుపులు తెరిచే ఉంటాయన్నారు. అలాగే సామాన్యుల కోసం తెలంగాణ సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+