పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇవే చివరి లాంగ్ హాలీడేస్ కానున్నాయి. సంక్రాంతి సెలవుల వేళ ప్రయివేలు క్లాసుల పేరుతో తరగతులు నిర్వహించే ప్రయివేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం హెచ్చరించింది.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలలకు ఈసారి సంక్రాంతికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆరు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉన్నాయి.

అయితే మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈ హాలీడేస్ నుంచి మినహాయింపు ఉంది. సంక్రాంతి సెలువులు జనవరి 12న ప్రారంభం అయితే.. మరుసటి రోజే రెండో శనివారం, తర్వాత ఆదివారం వస్తున్నాయి. 14 ఆదివారం భోగి పండుగ కాగా.. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదినం జరుపుకోనున్నారు.
సంక్రాంతి తరువాత జనవరి 16, 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవులు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ రానున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. కాగా జనవరి 25న ఆదివారం, 26 రిపబ్లిక్ డే వరుస సెలవులు రాబోతున్నాయి.
ఇక, ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షా షెడ్యూళ్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవులు పూర్తవుతూనే విద్యార్దులు పూర్తిగా పరీక్షల మూడ్ లోకి వెళ్లనున్నారు. దీంతో, సంక్రాంతి సెలవుల కోసం ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం నిరీక్షిస్తున్న సమయంలో తెలంగాణ విద్యా శాఖ సెలవుల పైన ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications