రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా..!!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా రేవంత్..కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా అప్పుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నిధులు సమీకరించుకుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మేర రుణ సమీకరణ చేసింది. ఇంత తక్కువ సమయంలో చేసిన ఈ రుణం గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

ఆప్పులతో ప్రారంభం
తెలంగాణలో ఆర్దిక పరిస్థితి పైన అధికారంలోకి వస్తూనే కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు..ఆర్దిక వ్యవస్థ గురించి అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసారు. రోజు వారీ ఖర్చులకు ఓడీకి వెళ్లాల్సి వస్తోందని ఆర్దిక శాఖ పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు.

TS Govt pull up funds Rs 1400 Cr by security bonds in last 15 days

తమ ప్రభుత్వంలో చేసిన అప్పులే కాదు..రాష్ట్రానికి అందించిన ఆస్తులు...చేసిన అప్పుతో జరిగిన మంచి గురించి వివరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసారు. అప్పు చేయటం తప్పు కాకపోయినా..రాష్ట్ర భవిష్యత్ కు మేలు చేసేలా ఆ అప్పును సద్వినియోగం చేయలేదనేది కాంగ్రెస్ వాదన. ఈ సమయంలో ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలు బయటకు వచ్చాయి.

రూ 1,400 కోట్ల రుణం
కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం ఆర్‌బీఐ ఆధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ నెల 12న రూ.500 కోట్లు, ఈ నెల 19న రూ. 900 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. ఇందులో రూ. 500 కోట్ల అప్పును 7.70 శాతం వడ్డీకి 15 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించేలా, రూ. 900 కోట్లను 7.58 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా సమకూర్చుకుంది.

వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకొనే ప్రక్రియలో భాగంగా ఆర్‌బీఐ ద్వారా బాండ్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి షెడ్యూల్‌ సమర్పిస్తాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి చెందిన షెడ్యూల్‌ను ఆర్‌బీఐ ఖరారు చేసింది.

ఆర్దిక సవాళ్లు
ఈ షెడ్యూల్‌ మేరకు డిసెంబర్‌లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ. 1,400 కోట్లు సమకూర్చుకుందని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆర్దిక కష్టాలు ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి.

ఈ నెల 28వ తేదీన మరో రెండు పథకాల అమలు పైన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక.. ఉద్యోగుల జీతాలతో పాటుగా సాదారణ పాలనా వ్యవహారాలకు ఆర్దికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో..ప్రభుత్వం ముందున్న సవాళ్లను రేవంత్ టీం ఏ రకంగా పరిష్కరిస్తుందీ..ఆర్దికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+