తెలంగాణ అప్పుల లెక్కలివే, ఖజనాలో ఎంత ఉంది - రేవంత్ కు భారీ సవాల్..!!

తెలంగాణ ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణలో ఆర్దిక పరిస్థితుల పై అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కాంగ్రెస్ నేతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రాష్ట్ర అర్దిక స్థితి గతులను ప్రజల ముందు ఉంచాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసన సభలో భట్టి శ్వేత పత్రం విడుదల చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు.

తెలంగాణలో అప్పులు : తెలంగాణలో ఆర్దిక నిర్వహణ కొత్త ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంలో కీలక అంశాలను వెల్లడించింది. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని ఆర్దిక మంత్రి భట్టి చెప్పుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందని వివరించారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2014- 15 లో అప్పు 72,658 కోట్లు కాగా..ఇప్పుడు రూ 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగిందని ప్రకటించారు.

TS Govt Releases white paper on state financial situation in the Assmebly

ఇదీ జరిగింది : అది పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదని ప్రభుత్వం శ్వేత పత్రంలో స్పష్టం చేసింది. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిందని భట్టి చెప్పారు. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళిందని వివరించారు. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందని చెప్పుకొచ్చారు. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేదిని..ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గిందని చెప్పారు. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయిందన్నారు. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని భట్టి ఆందోళన వ్యక్తం చేసారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు.

TS Govt Releases white paper on state financial situation in the Assmebly

హామీల అమలు ఎలా : బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణంగా విశ్లేషించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేసారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పుకొచ్చారు. ఇక..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గ్యాంరటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పరిగణలోకి తీసుకోకుండా హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే రేవంత్ కు అసలైన సవాల్ గా మారుతోంది. దీంతో..ఇప్పుడు గ్యారంటీల అమలు..సాధారణ పాలనా వ్యవహారాలను రేవంత్ ఎలా అధిమగిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+