హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పబ్‌లకు షాక్: రాత్రి 10 తర్వాత డీజే సౌండ్స్ బంద్, తేల్చి చెప్పిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పబ్‌ల వ్వవహారంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. రాత్రి 10 గంటల తర్వాత పబ్‌లలో డీజే, మ్యూజిక్ ను నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.

అయితే, తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్‌లోని పబ్ లకు మాత్రమే వర్తిసుందని తీర్పునిచ్చింది. సెప్టెంబర్ నెలలో పబ్‌లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ నిర్వహించి కీలక ఆదేశాలిచ్చారు.

 TS High Court orders to No Dj sounds after 10 pm in Jubilee hills pubs

పబ్‌ల విషయమై తీసుకున్న చర్యలపై నివేదికలను ఇవ్వాలని ముగ్గురు పోలీస్ కమిషనర్లను, జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. ఈ క్రమంలోనే ముగ్గురు పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తమ నివేదికలను సెప్టెంబర్ 26న కోర్టుకు సమర్పించారు.

అయితే, నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలకు సమీపంలో పబ్‌లను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న 10 పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సౌండ్స్‌ను పెట్టకూడదనే హైకోర్టు మరోసారి స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఉన్న 10 పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సౌండ్స్ ను పెట్టకడూదని తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్ లో ఉన్న ట్రాట్, జూబ్లీ 800, ఫర్టీ కేఫ్, అమ్నిషియా, హైలైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్లతోపాటు రో పవ్ లోనూ రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే సౌండ్స్, మ్యూజిక్‌ను ప్లే చేయకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది.

English summary
TS High Court orders to No Dj sounds after 10 pm in Jubilee hills pubs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X