తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల: మేడ్చల్ టాప్..
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు.
ఇక ఫలితాల విషయానికొస్తే.. ఉత్తీర్ణతలో మేడ్చల్ జిల్లా టాప్ లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో కొమురం భీమ్ జిల్లా ఉంది. 40శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్, సెకండియర్ రెండింటిలోనూ బాలికలదే పైచేయి కావడం విశేషం.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 69శాతం మంది బాలికలు, 55.5శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా మొదటి సంవత్సరంలో 2,84,225మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక ఇంటర్ సెకండియర్‌లో 67.25శాతం, అంటే 2,88,772 మందిఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 71.25శాతం కాగా.. బాలురు 61శాతం.
ఫలితాలను results.cgg.gov.in సైట్ ద్వారా '5*xh&th9'అనే పాస్‌వర్డ్ ఉపయోగించి తెలుసుకోవాల్సిందిగా డిప్యూటీ సీఎం తెలిపారు.












Click it and Unblock the Notifications