వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగ‌రేణి జోలికి వ‌స్తే ఢిల్లీ త‌ల్ల‌డిల్లాల్సిందే .. కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ కొంగు బంగారం సింగ‌రేణి సంస్థ‌ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేసేందుకు కేంద్రం కుట్ర‌లు చేస్తోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని దెబ్బతీస్తే మాత్రం కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని హెచ్చరించారు. ఈమేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు.

 సింగరేణి కోల్ మైన్ కాదు.. గోల్డ్ మైన్

సింగరేణి కోల్ మైన్ కాదు.. గోల్డ్ మైన్

నల్లచట్టాలు తెచ్చి దేశ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేసిన మోదీ ప్రభుత్వం.. ఇప్పడు తెలంగాణలోని నల్ల బంగారం సింగరేణిపై కన్నేసిందని మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. సింగ‌రేణి జోలికి వ‌స్తే ఢిల్లీ త‌ల్ల‌డిల్లాల్సిందేనని అన్నారు. బీజేపీపై మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దని హెచ్చరించారు. సింగరేణి కోల్ మైన్ కాదు.. గోల్డ్ మైన్ అని స్ప‌ష్టం చేశారు. మోదీ ప్రభుత్వం వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

 సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండ

సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండ


కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటం స్పూర్తితో మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. సింగరేణి కాపాడుకునేందుకు తాము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామన్నారు. వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తేల్చి చెప్పారు. సింగరేణి పరిధిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6, శ్రవనపల్లీ ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడాన్ని తప్పుపడుతూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 .బొగ్గు గనులను నేరుగా కేటాయించాలి..

.బొగ్గు గనులను నేరుగా కేటాయించాలి..

సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ఏడేండ్ల‌ కాలంలో 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని వివరించారు. బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పి ఎల్ ఎఫ్ ను కలిగి ఉందని తెలిపారు. తెలంగాణకే కాకుండా మహారాష్ట్రతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదన్నారు కేటీఆర్..

 వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదు

వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదు

సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు. గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంటుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని అవకాశాలు పోతాయని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో సింగరేణి సంస్థ కనుమరుగైపోతుందన్నారు. ఈ సంస్థ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తే అటు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు..

Recommended Video

Telangana Journalists కు KCR ఇచ్చిన వాగ్దానాన్నినెరవేర్చాలి - Basava Punnaiah | Oneindia Telugu
 వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిలా సింగరేణి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిలా సింగరేణి

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు కేటీఆర్. బీజేపీ పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానమా అని ప్రశ్నించారు. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ సంస్ధ అడిగిన వేంటనే లిగ్నైట్ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ర్టం కాదా అని నిలదీశారు.పక్క రాష్ట్రం ఆంధ్రపదేశ్ లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం.. దాన్ని ఇప్పుడు ప్రయివేటీకరించేందుకు సిద్ధమయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అందోళన వ్యక్తం చేశారు.

English summary
Minister KTR Warning to PM Modi govt over singareni coal mine auction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X