Vijayashanti: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి-భవిష్యత్తుకు హామీతోనే ?

బీజేపీ మాజీ నేత, టాలీవుడ్ నటి విజయశాంతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పేసిన విజయశాంతి ఇవాళ తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఖర్గే ఆమెకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాములమ్మ.. మరోసారి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సొంత గూటికి చేరారు.

ఇవాళ తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఆయన బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున్ ఖర్గే తో విజయశాంతి భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

TS polls: vijayashanti joined congress party, mallikarjun kharge assure mp tiket?

గతంలో తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించిన విజయశాంతి, అనంతరం టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కూడా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా 2018 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన విజయశాంతి ఇప్పటివరకూ అదే పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ తిరిగి ఆమె కాంగ్రెస్ లో చేరడంతో సొంత గూటికి చేరుకున్నట్లయింది. అయితే విజయశాంతికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎంపీగా బరిలోకి దించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి పరిమితం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+