తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా హాజరయ్యారు. మొత్తం 503 పోస్టుల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబరు లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపరు లీకేజీ వల్ల గ్రూప్-1 ఇంతకుముందు ఒకసారి రద్దయిన సంగతి తెలిసిందే.













Click it and Unblock the Notifications