సంక్రాంతికి ఊర్లకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్, హైదరాబాద్ నుంచి 1200 ప్రత్యేక బస్సులు..!!
సంక్రాంతి సమీపిస్తోంది. పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇందు కోసం ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఈ సారి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసుల్లోనూ రిజర్వేషన్లు ఖాళీలు లేవు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 1200 బస్సుల ను ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఇవి బయల్దేరనున్నాయి.
సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి 1,200 బస్సులు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు నగరం నలువైపులా ఉన్న ఆర్టీసీ డిపోల నుంచి నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు, విజయవాడ, రాజమండ్రి, ఉదయగిరి తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తున్నారు.

ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ సారి హైదరాబాద్ లోని బీహెచ్‌ఈఎల్ డిపో ఆర్సీపురం నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్టు ప్రకటించారు.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ఇప్పటికే రైళ్లు, బస్సులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, వాటిల్లో టికెట్లు చాలా వేగంగా అమ్ముడై పోయాయి. దీంతో కొంతమందికి రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారి కోసం మరో 11 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది.
ఈ సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.జనవరి 7 నుంచి 12వ తేదీల మధ్య కాకినాడ నుంచి వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications