తెలంగాణా ఆర్టీసీ మంచి ఆలోచన: చంటి పిల్లల కోసం బసాండ్లలో..!!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తెలంగాణ ఆర్టీసీ టాక్ అఫ్ ది టౌన్ అయింది. తెలంగాణ ఆర్టీసీని సమూల ప్రక్షాళన చేయడానికి నిర్ణయం తీసుకున్న సజ్జనార్ ప్రజలతో సోషల్ మీడియా వేదికగా టచ్లో ఉంటూ ఆర్టీసీ సేవలను మెరుగుపరచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు, చిన్న పిల్లలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలను ఇవ్వడానికి, వారికి భద్రతను కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.
12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రముఖ బస్ స్టాండ్ లలో బేబీ ట్రాలీలు
ఇటీవల 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూడా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా బస్టాండ్ కు వచ్చే మహిళా ప్రయాణికులు చంటి పిల్లలతో ఇబ్బందులు పడకుండా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది ఆర్టీసీ. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్దగా ఉన్న బస్టాండ్లలో బేబీ ట్రాలీ లను ఏర్పాటు చేసింది.
బేబీ ట్రాలీ సేవలను ప్రారంభించిన ఎమ్‌జిబిఎస్
హైదరాబాద్‌లోని ఎమ్‌జిబిఎస్‌లో టిఎస్‌ఆర్‌టిసి 'బేబీ ట్రాలీ' సేవలను ప్రారంభించడంతో పిల్లలను తీసుకెళ్లే మహిళా ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ చాలా పెద్ద బస్ స్టాండ్ కావడంతో ఇక్కడినుంచి ప్రయాణించాలి అనుకునేవారు తమకు సంబంధించిన స్టేజ్ మీదకి వెళ్లడం లో ఒక్కొక్కసారి చిన్న పిల్లలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బేబీ ట్రాలీ లను ఏర్పాటు చేసి వారికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది టి ఎస్ ఆర్ టి సి.
చంటిపిల్లలతో, లగేజీతో మహిళలకు బస్ స్టాండ్ లలో ఇబ్బంది; అందుకే బేబీ ట్రాలీలు
హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో బేబీ ట్రాలీ లను ఏర్పాటు చేయడంపై రంగారెడ్డి ఆర్ టి సి డిపో మేనేజర్ స్పందించారు. బస్ స్టేషన్ విశాలంగా ఉండడంతో మహిళలు తమ పిల్లలను లగేజీతో పాటు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సర్వీసును ప్రారంభించామని రంగారెడ్డి మేనేజర్ పేర్కొన్నారు. అయితే వీటిని ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ ఈ సౌకర్యం ఉంటే బాగుంటుందని అంటున్నారు. మరికొందరు ఎన్ని రోజులు పాటు వీటిని మెయింటెన్ చేస్తారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలపై, చిన్నారులపై ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ
ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు పైబడిన మహిళలకు మహిళా దినోత్సవం స్పెషల్ గా ఉచిత ప్రయాణాన్ని కల్పించిన ఆర్టీసీ, బస్టాప్ లలో మహిళా వ్యాపారులకు ఉన్న స్టాల్స్ కు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఎటువంటి చార్జీలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుంది.ఈ నెల 31వ తేదీ వరకు వారికి ఉచితంగా స్టాల్స్ నుకేటాయిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.గర్భిణీలకు, చంటిపిల్లలకు బస్సులలో రెండు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో మహిళా వ్యాపారులు డ్వాక్రా గ్రూపుల ద్వారా ఉత్పత్తుల సేల్స్ కోసం ఉచిత స్టాల్స్ ను, స్పేస్ ను అందించాలనిఆర్టీసీ నిర్ణయించినట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications