5 లక్షల మందితో బహిరంగ సభ: దీపావళికి దూరంగా: ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఖరారు..!
సమ్మెలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసింది. జేఏసీ నేతలు తమకు మద్దతుగా నిలుస్తున్న అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరాం, తమ్మినేని, చాడ, రావుల, మందకృష్ణ మాదిక హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు అమలు చేయాల్సిన కార్యచరణను ప్రకటించారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల కుటుంబ సభ్యుల తో సహా నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. చివరగా ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో అయిదు లక్షల మందితో భారీ సభ ఏర్పాటుకు అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ చర్చలకుపిలిచి..సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని నేతలు ప్రకటించారు.
30వ తేదీ వరకు నిరసనల షెడ్యూల్ ఖరారు..
ఆర్టీసీ జేఏసీ నేతలకు మద్దతుగా అఖిలపక్ష సమావేశం జరిగింది. అందులో రేపటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాల పైన నిర్ణయం తీసుకున్నారు. 21న తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. 22న తమ పొట్ట కొట్ట వద్దంటూ తాత్కాలిక పద్దతిన పని చేస్తున్న డ్రైవర్లు..కండక్టర్లను కలవాలని తీర్మానించారు. అదే విధంగా 23న అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరనున్నారు. 24న మహిళా కండక్టర్లతో నిరసన ప్రదర్శన చేపడుతామని వెల్లడించారు.

25న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు నిర్వహించి నిరసనలు తెలియ చేయనున్నారు. 26న కార్మికులు తమ పిల్లలతో కలిసి డిపోల వద్ద నిరసనలు..ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఇక, 27న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దీపావళి జరుపుకోకుండా నిరసన తెలియ చేయాలని తీర్మానించారు. ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో అయిదు లక్షల మందితో బహిరంగ సభకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి..
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని పలువురు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వ కోర్టు సూచనలను సైతం ఖాతర్ చేయటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తాము సిద్దంగా ఉన్నామని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేసారు. ఇదే సమయంలో కార్మికుల నిరసనలను పోలీసులతో అణిచి వేయాలని చూస్తే మరింత తీవ్రత పెరుగుతుందని జేఏసీ నేతలు హెచ్చరించారు.
సోమవారం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉండటంతో..ఆ తరువాత మాత్రమే ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె మీద ఫోకస చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, హైకోర్టు చేసింది సూచనలే కానీ.. ఉత్తర్వులు కాదని..అందునా కోర్టు వాయిదాకు ఈ నెల 28వ తేదీ వరకు సమయం ఉండటంతో చివరి నిమిషం వరకు ప్రభుత్వం వేచి చూసే ధోరణితో కార్మికుల మీద ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ జీతాలు అందక ఇబ్బంది పడుతున్న కార్మికులకు..సోమవారం వాటిని ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం కార్మికుల సమ్మె తీవ్రతను పక్కన పెట్టి ప్రధానంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications