దాడులు చేస్తే సహించేది లేదు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగులపై దాడులకుదిగితే సహించేది లేదని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్.. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
'నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి' అని అన్నారు వీసీ సజ్జనార్.

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన (ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు సజ్జనార్). బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్భాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి దాడులను ఆర్టీసీ యాజమాన్యం అసలు సహించదు. ఈ ఘటనపై ఆందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications