జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ మాల్‌కు నోటీసులు: ఇక టీఎస్ఆర్టీసీ చేతుల్లోకే
నిజామాబాద్: బీఆర్ఎస్ నేత, ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్‌కు ఆర్టీసీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయల చెల్లింపుపై నోటీసులు ఇచ్చినా.. జీవన్‌రెడ్డి స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ గడువు లోగా రూ.3.14కోట్ల బకాయిలు చెల్లించాలని, లేదంటే స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. విజిలెన్స్ సెక్యూరిటీ కరీంనగర్ రీజియన్ అధికారి బాబురావు, డిప్యూటీ రీజియన్ మేనేజర్ శంకర్, డిపో మేనేజర్ ఆంజనేయులు ఇతర అధికారులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాల్‌కు వెళ్లి నోటీసులు ఇచ్చారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఇందులో మొదట విద్యుత్ అంశంపై చర్చకు రాగా, అందులో ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి మాల్‌పై ప్రస్తావన వచ్చింది. ఆర్మూర్‌లోని స్థానిక బస్టాండ్‌ను ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది.
అయితే, ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు. అయినా బకాయిలు చెల్లించకపోవడంతో గురువారం మాల్ స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు.
అంతేగాక, ఆర్టీసీ సిబ్బంది మాల్ వద్దకు వెళ్లి మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు వెల్లడించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. మరోవైపు, విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో మాల్‌కు గురువారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications