కించపర్చారు: అల్లు అర్జున్, ర్యాపిడోకు టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు, సజ్జనార్ స్పందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రతిష్టను కించపర్చినందుకు ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన.
టీవీ ఛానల్ ప్రకటనల్లో, యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ఆ ప్రకటనలో చెప్పడం కనిపిస్తుంది.

ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారంతా ఖండిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.
ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Recommended Video
కాగా, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను లాభాల్లో నడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు సజ్జనార్. పలుమార్లు ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించారు. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతేగాక, ఆర్టీసీ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు. కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికులను తక్కువ ఖర్చుతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.












Click it and Unblock the Notifications