టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులతో చర్చలు..పరిష్కారం వస్తుందా.. కోర్టుకు వెళతారా...?
ఆర్టీసీ సమ్మెపై సానుకూల పవనాలు ఏర్పడ్డాయి. కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు అధికారుల బృందం చర్చలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే చర్చలు అధికారులతో చేపట్టనున్న చర్చలు ఫలితాలను ఇస్తాయా లేక కోర్టుకు తిరిగి వెళతారా అనే ఉత్కంఠ నెలకోంది.
21 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే... అయితే చర్చలపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు కార్మిక సంఘాలు పట్టుదలకు వెళ్లాయి. దీంతో సమస్యకు ఫుల్‌పెట్టే పరిస్థితి కనిపించక పోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద కోర్టు జోక్యంతొ శనివారం కార్మిక సంఘాలతో అధికారులు చర్చలు జరపనున్నారు. దీంతో పూర్తిస్థాయిలో చర్చలు జరుగుతాయా లేక కోర్టు సూచించినట్టుగా 21 అంశాలపైనే చర్చలు జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకోంది. అయితే చర్చలు ఇరువర్గాల మధ్య సానుకూల వాతవరణంలో కొనసాగితేనే పరిష్కారానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇరువర్గాలు పట్టుదలకు పోతే మాత్రం కోర్టు జోక్యంతోనే సమ్మె కు పరిష్కారం లభించనుంది.

ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ విలీనం అనేది లేదని , అసలు అర్టీసీ మనుగడే కష్టమని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఆర్టీసీని ఎవ్వరు కాపాడలేరని కుండ బద్దలు కొట్టారు. భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీ బాగుపడే అవకాశాలే లేవని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే అయితే సమ్మెకు వెళ్లిన కార్మికులు ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్‌గా ముందుకు సాగుతున్నారు. విలీనం నుండి కార్మికులు వెనక్కి తగ్గే అవకాశాలు లేవని జేఏసీ కన్వీనర్ అశ్వథ్దామ రెడ్డి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే ఇరు పక్షాలు ఎవరి పట్టుదలలో అవి ఉన్నాయి.












Click it and Unblock the Notifications