శ్రీశైలం సహా 43 శైవ క్షేత్రాలకు TSRTC ప్రత్యేక బస్సులు - షెడ్యూల్, ఛార్జీలు..!!

మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. 43 శైవ క్షేత్రాలకు రాక పోకలు సాగించేందుకు ప్రత్యేక బస్సులు ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ టికెట్ ధరలను సవరించింది. మహాలక్ష్మీ పథకం ఈ బస్సుల్లోనూ అమలు కానుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం కు స్పెషల్ బస్సులను ఖరారు చేసింది. శివరాత్రి ప్రత్యేక బస్సులు ఈ నెల 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

మహా శివరాత్రి పర్వదినం వేళ భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహే శ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.

TSRTC to Run 2 243 Special Buses for Shaiva pilgrimage centers during Maha Shivaratri from February 14 to 16

శ్రీశైలం కు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ తో పాటుగా హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కె.పి.హెచ్.బి, బీహెచ్ ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించగా.. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరించిన ఛార్జీలు ఈ నెల 14నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే అమల్లో ఉంటాయి.

ఈ బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం కొనసాగింపు

ప్రయాణీకులకు సమాచారం తెలిపే విధంగా స్పెషల్ సర్వీసులకు బస్సులకు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్‌లను సైతం ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గత శివరాత్రితో పోల్చితే ఈ సారి 208 బస్సుల ను అదనంగా సంస్థ నడపనుంది. మహాలక్ష్మీ పథకం అమల్లో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా కొనసాగనుంది.

హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఆర్టీసీ కల్పించింది. ముందస్తు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు www.tgsrtcbus.in వెబ్ సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అదే విధంగా మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+