నాడు ఎన్టీఆర్ నేడు రేవంత్, మోత్కుపల్లిపై సంచలనం: కంచర్లకు ఎల్ రమణ నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ వైపు రేవంత్ రెడ్డి రాజీనామా చేయగా, మరోవైపు తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మరో సీనియర్ నేతకు నోటీసులు జారీ చేశారు.

రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

కంచర్ల భూపాల్ రెడ్డికి ఎల్ రమణ ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ సందర్భంలోని వివరాలను మీడియాకు వేరేలా ఇచ్చారని అభియోగంతో ఈ నోటీసులు జారీ చేశారు.

ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

రేవంత్ వెళ్లిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు

రేవంత్ వెళ్లిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు

శనివారం చంద్రబాబుతో భేటీ అనంతరం కంచర్ల గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వెళ్లిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

నాడు ఎన్టీఆర్ ఆవేదనకు, నేడు రేవంత్ వెళ్లిపోవడానికి

నాడు ఎన్టీఆర్ ఆవేదనకు, నేడు రేవంత్ వెళ్లిపోవడానికి

ఆనాడు నందమూరి తారక రామారావు ఆవేదనకు, సంక్షోభకు ఎవరైతే కారణమో అతనే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్లిపోవడానికి కారణమని కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మోత్కుపల్లిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. రేవంత్ చెప్పినట్లుగా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, అవసరమైతే టీఆర్ఎస్‌తో కలుస్తామని మోత్కుపల్లి చెప్పిన విషయం తెలిసిందే.

రేవంత్ ఒంటరిగా వెళ్లడం బాధించింది

రేవంత్ ఒంటరిగా వెళ్లడం బాధించింది

గుత్తా సుఖేందర్ రెడ్డి వెళ్లిపోయినా తాను పార్టీ వీడలేదని, కోమటిరెడ్డి సోదరులతో పోరాడుతున్నానని భూపాల్ రెడ్డి చెప్పారు. టిడిపిలో కొందరు రేవంత్‌కు వ్యతిరేకంగా పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ఒంటరిగా వెళ్తుండటం బాధించిందన్నారు. కాగా, టీడీపీ నుంచి ఒక్కరొక్కరు వెళ్తుండటంతో భూపాల్ రెడ్డి కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.

రేవంత్.. బాబుతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నాడు

రేవంత్.. బాబుతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నాడు

భూపాల్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. తాను కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఇక్కడ అవకాశం లభించకపోవడంతో రేవంత్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి వద్దని టిడిపిని వీడి వెళ్లిపోయాడని చెప్పారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా మట్లాడాలని రేవంత్ భావించారన్నారు.

రేవంత్‌కు కాంగ్రెస్ ఏమిటో తెలుస్తుంది

రేవంత్‌కు కాంగ్రెస్ ఏమిటో తెలుస్తుంది

రేవంత్ రెడ్డి టీడీపీని వీడటం ఆయన వ్యక్తిగతం అని టిడిపి మరో నేత పెద్దిరెడ్డి అన్నారు. రేవంత్ వెళ్లిపోవడం పెద్ద లోటు అన్నారు. కాంగ్రెస్ మహాసముద్రం అని, ఆ పార్టీలోకి వెళ్లాక కాంగ్రెస్ ఏమిటో రేవంత్‌కు తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్‌పై తమ పోరాటం ఆగదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam chief L Ramana on Sunday issued notices party senior Kancharla Bhupal Reddy.
Please Wait while comments are loading...