ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్, నిద్ర పట్టట్లేదు: హరీష్ రావు
మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పని చేస్తున్నారని మంత్రి హరీష్ రావు గురువారం నాడు మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు.
ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం చేసే భూసేకఱణను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ పైన గవర్నర్ నరసింహన్కు తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం సరికాదన్నారు.

చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు యాక్షన్ చేయడం సరికాదన్నారు. రూ.3వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. తాము ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని విపక్షాలను హరీష్ రావు ఈ సందర్భంగా నిలదీశారు.
కాగా, మంత్రి హరీష్ రావు గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంగెంబండ వద్ద ఏర్పాటు చేస్తోన్న రిజర్వాయర్ను పరిశీలించారు. హరీష్ రావు వెంట పలువురు తెరాస నేతలు, అధికారులు ఉన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications