టీవీ నటి కిడ్నాప్, ఆపై అత్యాచారం.. అనంతపురంలో కీచకుడి అరెస్టు!
ఓ టీవీ నటిని కిడ్నాప్ చేసి అనంతపురంలో తన ఇంటికి తీసుకెళ్లిన గిరీశ్ అనే వ్యక్తి అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆమె పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య ఉదంతం చల్లారక ముందే ఓ టీవీ నటిపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉంటూ టెలివిజన్ రంగంలో ఆర్టిస్టుగా రాణిస్తోన్న ఓ మహిళపై.. అనంతపురానికి చెందిన గిరీశ్ అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు అందింది.
చదవండి: అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో నివసించే టీవీ ఆర్టిస్టును.. అదే ప్రాంతంలో ఉంటోన్న అనంతపురం వాసి గిరీశ్ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

తన మాట వినకుంటే ఆ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో గిరీశ్ బాధితురాలిని బెదిరించి అనంతపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఎలాగోలా ఆ కీచకుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా హైదరాబాద్ వచ్చి.. తనపై జరిగిన అకృత్యాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు.. అనంతపురంలో గిరీశ్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications