హుస్సేన్ సాగర్ లా జంట జలాశయాలు మారతాయి; న్యాయపోరాటం చేస్తామన్న పర్యావరణవేత్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా జీవో 111 ఎత్తివేస్తామని చేసిన ప్రకటన, ఆపై ఇటీవల మంత్రివర్గ భేటీలో ప్రభుత్వ ఉత్తర్వు (GO) 111ని రద్దు చేయడానికి ఆమోదించిన తరువాత, పర్యావరణ వేత్తలు మరియు శాస్త్రవేత్తలు ఈ చర్యపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయవ్యవస్థ తలుపులు తడతామని హెచ్చరించారు.

జీవో 111ఫై పీపుల్స్ కమిటీ సమావేశం

జీవో 111ఫై పీపుల్స్ కమిటీ సమావేశం

జీవో 111 ను ఎత్తివేస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలపటంతో నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.శుక్రవారం లామకాన్‌లో "సేవ్ హైదరాబాద్, సేవ్ ట్విన్ డ్యామ్స్, సేవ్ క్యాచ్‌మెంట్ ఏరియా ఆఫ్ ట్విన్ రిజర్వాయర్స్, ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్" అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ జీవో రద్దు చేయడంపై హైదరాబాద్ నగర భవిష్యత్ పై పర్యావరణ వేత్తలు చర్చించారు.

 ఎన్నికల హామీగా జీవో రద్దు చేస్తామన్న కేసీఆర్

ఎన్నికల హామీగా జీవో రద్దు చేస్తామన్న కేసీఆర్

హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాలలో ఎత్తైన నిర్మాణాలను నిర్మించడాన్ని నిషేధిస్తూ 1996లో జీవో 111 మొదట జారీ చేయబడింది. ఇక ఈ జీవో వల్ల ఈ ప్రాంతాలలో భవనాల నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

జీవో రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రజాకమిటీ సభ్యులు

జీవో రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రజాకమిటీ సభ్యులు

జీఓ 111 రద్దుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏప్రిల్ 12న కేసీఆర్ ప్రకటించారు.ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రజాకమిటీ సభ్యులు ఆ జీవో రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు.దీంతో నగరానికి వరద ముప్పు పొంచి ఉందని, ఈసా-మీసా ఉపనదులపై ఆనకట్టలు, జీవో ప్రభావితం చేసే భూములను తొలగిస్తే నగరం దెబ్బతింటుందని వారంటున్నారు.

పీపుల్స్ కమిటీలో ఐఐసిటి నుండి రిటైర్డ్ సైంటిస్ట్ కె బాబూరావు, యుఎన్ఇపి మాజీ కన్సల్టెంట్ & కో-కన్వీనర్-సౌత్ ఏషియన్ పీపుల్స్ యాక్షన్ ఎగైనెస్ట్ క్లైమేట్ క్రైసిస్ సాగర్ ధార, మరియు రామ లింగేశ్వరరావు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి రిటైర్డ్ సైంటిస్ట్ ఉన్నారు.

హుస్సేన్ సాగర్ లా ఉస్మాన్ మరియు హిమాయత్ సాగర్ లు మారతాయని ఆందోళన

హుస్సేన్ సాగర్ లా ఉస్మాన్ మరియు హిమాయత్ సాగర్ లు మారతాయని ఆందోళన

జీఓ 111పై హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న పీపుల్స్ కమిటీ దీనిని అడ్డుకోవటానికి పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై గతంలో సమావేశాలకు నేతృత్వం వహించిన కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ, జీవో 111ని రద్దు చేయడం ద్వారా వారు చేసిన ఘోరమైన తప్పును ప్రభుత్వానికి తెలియజేయడం పౌరులుగా తమ కర్తవ్యం అని అన్నారు. ఉస్మాన్ మరియు హిమాయత్ సాగర్ సరస్సులు హుస్సేన్ సాగర్ లా తయారవుతుందని పేర్కొన్నారు. సరస్సులలోని నీరు అత్యంత కలుషితమవుతుంది, ఇది ఈ ప్రాంతంలోని పక్షులు, వృక్షజాలం మరియు జంతుజాలంపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.

జీవో రద్దుతో పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్న పర్యావరణ వేత్తలు

జీవో రద్దుతో పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్న పర్యావరణ వేత్తలు

పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లోని బోరుబావులు ఎండిపోతాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు.హైదరాబాద్ మహా నగరంతో ముడిపడిన జీవవైవిద్యం, పర్యావరణ సమతుల్యప్రాంతం ఈ రెండు జలాశయాల పరిధిలోనేఉందని. ఈ జీవో రద్దుతో పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇది జలాశయాలను నాశనం చేసే కుట్ర అని, జీవో రద్దు నిర్ణయాన్ని విరమించుకోకుంటే కోర్టు మెట్లు ఎక్కుతామని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+